హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలతకు వై ప్లస్ సెక్యురిటీ 

బీజేపీ తరపున హైదరాబాద్ అభ్యర్థిగా.. అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు మాధవీలత. హైదరాబాద్ అనేది ఎంత సెన్సిటీవ్ నియోజకవర్గమో అందరికీ తెలిసిన విషయమే. అందుకే అక్కడి నుంచి పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలతకు హై సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆమెకు వై ప్లస్  సెక్యూరిటీ కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. హైదరాబాద్‌లో మజ్లిస్  అధినేత అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విఐపి  సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పోలీసు సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. ఆరుగురు సిఆర్పిఎఫ్  పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమెకు ఎల్లప్పుడూ భద్రతగా ఉంటారు. మరో ఐదుగురు సాయుధులైన గార్డులు మాధవీలత ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వై ప్లస్  సెక్యూరిటీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News