ఏమీ సేతురా జ‌గ‌నూ.. ఏమీ సేతురా?!

శ‌తృత్వం ఉండ‌కూడ‌దు. అందులోనూ ఒకే పార్టీవారి మ‌ధ్య అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ బ‌య‌ట స‌మ‌స్య‌లు ఉన్నా అది పార్టీ స‌మ‌స్య‌గా మార‌కూడ‌దు. మారితే పార్టీతో పాటు పార్టీ అధినేత ప‌రువు కూడా గంగ‌పాల‌వుతుంది. కానీ ఆగ్ర‌హావేశాల‌తో కొట్లాట‌కు దిగేవారు, కొట్టుకునేవారికి అస‌లా ఆలోచ‌న ఉంటుం దా? ఉండ‌ద‌నే  వింజ‌మూరు సంఘ‌ట‌న తెలియ‌జేస్తోంది. పోలీసు స్టేష‌న్‌దాకా వెళ్లేంత గొడ‌వ‌ల‌తో ఇప్ప టికే కారాలు మిరాయాలూ నూరుతున్న వైసీపీ నేత‌లు, వీరాభిమానులు పోలీసుల స‌మ‌క్షంలోనే కొట్టు కున్నారు. 

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో కాలం, ప్రాంతం, ప్ర‌దేశంతో ప‌నిలేదు. అన్నిచోట్లా ఇలానే ఇరు పార్టీల వారూ ఆగ్ర‌హంతో ఆ ప్రాంతాన్ని క‌ల్లోలం చేయ‌డం జ‌రుగుతూంటుంది. రాజ‌కీయాల సంబంధించిన వ‌యితే చాలామంది ఇలానే గ‌ట్టిగా అరుచుకుంటూ తిట్ల‌పురాణంతో పాటు త‌మ త‌ప్పిదాల‌ను ఒక‌రి మీద ఒక‌రు విసురుకుంటూ క‌ళ్లెర్ర‌చేసుకుని కొట్లాట‌కు దిగుతారు. ఈ మొత్తానికి చిన్న‌దేదో కార‌ణం ఉండ‌వ చ్చు. ఇటీవ‌ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల గురించి కూడా కొట్టుకుంటున్నారు. పార్టీ నేత‌లు ఎలా ఉన్నా పార్టీ వీరాభిమానులు త‌మ‌లో తాము పోటీప‌డ‌టంలో వారి శారీర‌క‌, ఆర్ధిక స్థితిగ‌తులు మ‌ర్చిపోయి మ‌రీ దారుణా ల‌కు పాల్ప‌డుతున్నారు. పార్టీ నాయ‌కులు ఆ త‌ర్వాత వారిని ఎంత‌గా ర‌క్షించుకుంటారో ఏమోగాని  ఆ క్ష‌ణం ఆగ్ర‌హావేశాల‌కు లోన‌యి ర‌క్తం చూడ‌కుండా ఒక్క‌డుగు కూడా వెన‌క్కి వేయ‌డం లేదు. ఇదే సీన్లు ప్ర‌తీ చోటా జ‌రుగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోనూ జ‌రిగింది. కాబోతే ఇది కొంత చిత్ర‌మైన‌ది.

ప్ర‌దేశం .. నెల్లూరు జిల్లా వింజ‌మూరు. ఇటీవ‌ల ఇక్క‌డి పోలీస్ స్టేష‌న్ కి వైసీపీ నేత‌లు, ఇద్ద‌రు పార్టీ వీరాభిమానులు వెళ్లారు. అక్క‌డ ఏమ‌యిందో ఏమోగాని హ‌ఠాత్తుగా తిట్టుకున్నారు, మ‌రుక్ష‌ణం నేత‌లు అని చూడ‌కుండా వీరాభిమానులు గొడ‌వ‌ప‌డ్డారు. నేత‌లు రెచ్చిపోయి కొట్టారు. మ‌న పార్టీవారే న‌ని అభిమానులు దెబ్బ‌లు తిన‌లేదు.. వారూ ఎదురుతిరిగి నేత‌ల‌కు చుక్క‌లు చూపించారు.  వాళ్లు తిట్టుకో వ‌డం, అరుచుకోవ‌డం వ‌ర‌కూ చూసి ఆనందించిన పోలీసులు ఏకంగా వారు కొట్టుకోవ‌డం చూసి అమితా శ్చ‌ర్య‌పోయారు. ఒకే పార్టీవారు ఏదో క్ష‌ణంలో క‌లిసిపోతారు, ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చి మ‌నం మ‌నం బ‌రం పురం అనుకుంటారులే అనుకుంటారు. కానీ ఇక్క‌డ సీన్ అందుకు పూర్తి విరుద్ధంగా మారింది.

పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చిన‌వారు, కొట్టుకున్న‌వారూ వైసీపీ పార్టీకి చెందిన‌వారే. అధికార పార్టీకి చెందిన‌ వారు కావడంతో పోలీసుల‌కు ఏమి చేయాలో తోచ‌లేదు. ఓర్నాయ‌నో కొట్టుకోకండ్రా.. అనీ అన‌లేక‌, వీరాభిమా నుల ను తిట్టి ఇవ‌త‌ల‌కు లాగేయ‌లేకపోయారు. ఎవ‌రికి ఏం చెబుతారు? ప్రేమించుకున్న‌వారే ఇలా  ప‌క్కా విరో ధుల్లా  కొట్టుకు ఛ‌స్తుంటే ఎన్టీఆర్ సినిమా చూసిన‌ట్టు చూడ్డం త‌ప్ప పోలీసుల‌కు పాలు పోలేదు. కాబోతే పోలీసు స్టేష‌న్, పోలీసుల ప‌రువు పోతుంద‌ని ఎస్సై జంప‌ని కుమార్ మాత్రం ఇరు వ‌ర్గాల మీదా కేసు న‌మోదు చేసుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu