దానం నాగేందర్ కు ఏమైంది? ఎక్కడున్నారు?

 

దానం నాగేందర్.. తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా గ్రేటర్ రాజకీయాల్లో ఈ పేరు బాగా సుపరిచితం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, మంత్రిగా తన సత్తా చాటిన దానం.. కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈమధ్య తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే మిగతా ఎమ్మెల్యేల లాగానే దానం కూడా ఒక విషయం గురించి టెన్షన్ పడుతున్నారట. నిజం చెప్పాలంటే మిగతా వారి కంటే ఈయన కాస్త ఎక్కువగానే టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆయన టెన్షన్ దేనికి? అనేగా మీ డౌట్. ఇంక దేనికి మంత్రి పదవి గురించి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసారు. ఆయనతో పాటు మహమ్మద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? మంత్రివర్గంలో మాకు చోటు దక్కుతుందా? అంటూ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వారిలో దానం ఒకరు. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. మంత్రి పదవి వరిస్తుందా? లేదా? అని ఆలోచిస్తూ అనారోగ్య సమస్యలు తెచుకున్నారట.

దానం నాగేందర్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యతో కేరళ వెళ్లి చికిత్స చేయించుకొని వచ్చారని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతుండడంతో పదవి వస్తుందో రాదోనని ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారని సమాచారం. ఆయన మానసికంగా ఇబ్బంది పడడంతో ఆయనను చికిత్స నిమిత్తం కేరళకు తీసుకెళ్లారట. ఆయనకు అడుగులు తడబడి, మాట వంకరపోయిందంట. దీంతో కేరళలో చికిత్స చేయించుకొని ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారని తెలుస్తోంది. ఒకప్పుడు సీనియర్ నేతగా చక్రం తిప్పారు.. మొన్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే అంతగా నమ్మకం లేని ఖైరతాబాద్ స్థానంలో గెలిచి తన సత్తా చాటారు. అలాంటి నేత మంత్రి పదవిపై బెంగతో మానసిక క్షోభకు గురయ్యారని వార్తలు వస్తుండటంతో చర్చనీయాంశమైంది.