కరోనా కట్టడికి మూడు జోన్ల ప్రతిపాదన
posted on Apr 12, 2020 12:01PM
లాక్ డౌన్ పై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కట్టడికి దేశాన్ని 3 జోన్లుగా విభజించాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి ఇప్పటికే ఈ తరహా ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందుంచారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే రెడ్ జోన్లలో పూర్తి స్థాయి ఆంక్షలు విధించాలని, ఆరెంజ్ జోన్ లో పరిమిత స్థాయిలో ఆంక్షలు విధించాలని, గ్రీన్ జోన్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.