సజావుగా సాగుతున్న వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్
posted on Nov 21, 2015 8:39AM
(2).png)
వరంగల్ లోక్ సభ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లో నిలబడి ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు వీలుంటుంది. కడియం శ్రీహరి రాజీనామాతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో ఉన్న ఒకే ఒక స్థానానికి తెరాస, బీజేపీ, కాంగ్రెస్, వైకాపా, వామపక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ తో కలిపి మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో ఉన్న 15, 09, 671 ఓటర్ల కోసం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మొత్తం 9, 428 మంది ఎన్నికల సిబ్బందిని, 20 కంపెనీల పోలీసు బలగాలను ఎన్నికల సంఘం నియమించింది. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.