ఉండవల్లి..ఊసరవెల్లి!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి ఊసరవెల్లిగా మారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత మేధావి  ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగానే ఆయన జనంలో క్రెడిబులిటీ కోల్పోయి చులకన అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంత సేపూ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ కు వత్తాసు పలికేందుకు తెలిసిన వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రువు విమర్శించారు. స్కిల్ కేసు విచారణను సీబీఐ చేపట్టాలని కోరుతూ ఉండవల్లి హైకోర్టులో కేసు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించి జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ అక్రమ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించడం జగన్ కుట్రలో భాగమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. స్కిల్ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా   ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందుగా అరెస్టు చేసేసింది. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామనీ, విచారణలో బయటకు వచ్చే అవకాశాలున్నాయనీ అంటూ కోర్టుల్లో చెబుతోంది. సెక్షన్ల జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అరెస్టు అక్రమమని విస్పష్టంగా తేలిపోతున్నదని సీఐడీ చీఫ్ ఊరూరా తిరుగుతూ మీడియా సమావేశాలలో చెబుతున్న మాటలే తేటతెల్లం చేస్తున్నాయి. 
అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించారు.  జగన్ సర్కార్ చంద్రబాబు జనంలో మమేకం అవ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో పన్నుతున్న కుట్రలకు ఉండవల్లి సహకారం అందిస్తున్నారు.  చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో విమర్శలు చేసిన ఉండవల్లి ఈ నాలుగున్నరేళ్లలో జగన్ మద్యం విధానాలపై ఒక్కసారి కూడా నోరు మెదపలేదు?  ఇసుక దోపిడీపై మాట్లాడింది లేదు.  రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఉండవల్లి మౌనం వహించారు. అయితే నిలవని కేసు విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాత్రం ఏకంగా సీబీఐ విచారణ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఉండవల్లి తీరు మొదటి నుంచీ తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇబ్బందులలో పడినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి.. తనకు మాత్రమే సాధ్యమైన అసంబద్ధ లాజిక్ తో జనాలను కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యమన్నట్లుగా ఉంది. 

సమైక్య వాదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా రాష్ట్ర విభజన సమయంలో బిల్డప్ ఇచ్చిన ఉండవల్లి.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం ప్రకటించిన ఉండవల్లి.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తూ వచ్చారు.  

మార్గదర్శిపై పోరాటం అంటూ రచ్చ చేసే ఉ:డవల్లి జగన్ అరాచక పాలనపై ఒక్క సారి కూడా నోరెత్తలేదు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై మాట్లాడింది లేదు. ఏటువంటి ఫిర్యాదూ లేని మార్గదర్శిపై పోరాటం అనే ఉండవల్లి వేల మంది ఆరోపణలూ, ఫిర్యాదులూ చేస్తున్నా అగ్రిగోల్డ్ సమస్యపై ఎందుకు మాట్లాడరన్న ప్రశ్నకు ఆయన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు లేకుండా నోరెత్తరని పరిశీలకులు విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు.  ఉండవల్లికి ఒక నిశ్చితాభిప్రాయం ఉన్న దాఖలాలు లేవనీ, విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్న ఆయన ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి మద్దతు దారుగా, ఏపీలో ఆయన పార్టీకి తాను సంపూర్ణ మద్దతు ఇస్తానంటూ ముందుకు వచ్చారు. ఏకంగా జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకే కేసీఆర్ తో భేటీ అయిన రోజునే ఉండవల్లి కూడా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. ఇరువురి మధ్యా జరిగిన చర్చలు ఏమిటన్నది పక్కన పెడితే.. ఆ భేటీ తరువాత ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలో బీఆర్ఎస్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తన రాజకీయగురువు వైఎస్ కుమారుడికి ప్రయోజనం చేకూర్చేందుకే కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడిన ఉండవల్లి.. విభజన వాదానికి కర్త, కర్మ, క్రియా అయిన కేసీఆర్ తో చేతులు కులిపారని విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉండవల్లి మేధావి ముసుగులో జగన్ కుట్ర రాజకీయాలకు వంత పాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అమరావతిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల జపంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ విధానాలపై పల్లెత్తు మాట అనకుండా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ కుట్రపూరితంగా నమోదు చేసిన సిల్క్ కేసులొ సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే ఆయన విశ్లేషణలూ, విమర్శల వెనుక ఉన్నది జగనేనని స్పష్టమౌతోందని పరిశీలకులు చెబుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu