డ్రైవర్ రాయుడు హత్య కేసులో నిందితుల ఫోటోలు విడుదల

 

శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంచార్జ్ వినూత కోట డ్రైవర్ హత్య కేసులో నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో సహా శివకుమార్, షైక్ తాసాన్, గోపిలను చెన్నై  పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రెండు వారాల క్రితం డ్రైవర్ రాయుడిని వినుత విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత చెన్నైలోని కూవం నదిలో మూడు రోజుల క్రితం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై జనసేన గుర్తు, వినుత పేరు ఉండడంతో దర్యాప్తును వేగవంతం చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు, రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో వినుత, ఆమె భర్త, మరో ముగ్గురు నిందితులుగా తేలింది. వీరందరిని పోలీసులు చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారణ జరిపారు. రాయుడు ఆంధ్రాలో మర్డర్ చేసి చెన్నై లో పడేశాడు. హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించాం. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. ప్రస్తుతం వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu