వినేశ్ ఫోగట్ కాంస్య పతకానికి అర్హురాలే!
posted on Aug 9, 2024 10:00AM
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకానికి అర్హురాలే అంటూ భారత్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. పారిస్ స్పోర్ట్స్ కోర్టులో వినేష్ ఫోగట్ కు ఊరట లభించింది. అధిక బరువు కారణంగా ఆమె ఫైనల్ మ్యాచ్ మాత్రమే ఆడలేకపోయిందని, కాబట్టి సిల్వర్ మెడల్‌కు అర్హురాలు అంటూ ఆమె తరఫున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాదించింది. ఫోగట్ పైఅనర్హత వేటుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవ చ్చునని పేర్కొంది.
వినేశ్ ఫొగాట్ తరఫున జోయెల్ మోన్లూయీస్, ఎస్టేల్ ఇలనోవా వాదనలు వినిపించారు. ఆమె పిటిషన్‌ను కోర్టు సమర్థించడంతో ఫోగట్ సిల్వర్ మెడల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇలా ఉండగా అంతర్జాతీయ రెజ్లింగ్ క్రీడాకారుల నుంచి కూడా ఫోగట్ కు మద్దతు లభిస్తోంది.
వినేశ్ ఫోగట్ కు కాంస్య పతకం ఇవ్వాలని అమెరికా ఫ్రీస్టైల్ రెజ్లర్ జోర్డాన్ ఐరోస్ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డాడు. ఫోగట్ కాంస్య పతకానికి పూర్తిగా అర్హురాలని జోర్డాన్ ఐరోస్ పేర్కొన్నాడు. ఆరు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన జోర్డాన్ ఐరోస్ 2012 ఓలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించాడు. అటువంటి జోర్డాన్ ఐరోస్ ఫోగట్ కు అండగా నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.