వినుకొండ ఎమ్మెల్యేకు షాక్.. సొంత మండలంలో వైసీపీ ఘోర పరాజయం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ బాగా పుంజుకుంది. పలు జిల్లాలో ఊహించని విజయాలు నమోదు చేసుకుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాకిచ్చింది టీడీపీ. 

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ఓటర్లు షాకిచ్చారు. ఎమ్మెల్యే సొంత మండలం శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 1046 ఓట్లు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి హైమావతి గెలిచారు. జడ్పీటీసీ ఎన్నికను మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాలుగా తీసుకున్నారు. శావల్యాపురం జడ్పీటీసీగా గెలవడంతో వినుకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు నూతనోత్సాహంతో ఉన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu