రాములమ్మకు ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ పదవి

బీజేపీని  వీడి కాంగ్రెస్ గూటికి చేరగానే  విజయశాంతికి ఆ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలకు చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ కు ఇప్పుడు రాములమ్మ వాగ్ధాటి అదనంగా తోడు కానున్నది. ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ఇప్పటికే  తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం  హోరెత్తింది.

బీఆర్ఎస్ పై ప్రజావ్యతిరేకత, బీజేపీతో అధికార పార్టీ  రహస్య ఒప్పందం ఆరోపణలకు కాంగ్రెస్ లో కొత్త జోష్ ను నింపాయి. వరుస సర్వేలలో కాంగ్రెస్ ముందంజలో ఉందన్న నివేదికలు రావడంతో క్యాడర్ కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ కు ప్రతి ఎన్నికలోనూ కాళ్లకు అడ్డంపడేలా ఉండే గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలు, అసమ్మతి  రాగాలూ ఈ సారి పెద్దగా వినబడటం లేదు. అన్ని గ్రూపులనూ, అందరు నాయకులను కలుపుకుని పోయేలా అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి కార్యాచరణను రూపొందించడంతో  ఆ పార్టీ  ఎన్నికల ప్రచారంలో అవాంతరాలు, అడ్డంకులూ లేకుండా దూసుకుపోతున్నది.

ఇక తాజాగా ఏర్పాటు చేసిన కమిటీల విషయానికి  వస్తే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో  విజయశాంతి  శుక్రవారం  (నవంబర్ 17) కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆమెకు ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలకు చీఫ్ కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టారు.  ఆ 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu