చిట్టీల చిట్టెమ్మా.. గుట్టంతా చెప్పమ్మా!
posted on Apr 10, 2014 4:45PM

టీవీ, సినిమా వాళ్ళ చెవుల్లో చిట్టీల పేరుతో పూలు పెట్టి, కోట్ల రూపాయలను మూటగట్టుకుని వెళ్ళిపోయిన టీవీ నటి, ఇప్పుడందరూ ముద్దుగా ‘చిట్టీల చిట్టెమ్మ’ అని పిలుచుకుంటున్న విజయరాణిని ఎట్టకేలకు పోలీసులు వెతికీ వెతికి పట్టుకున్నారు. బెంగుళూరు విద్యారణ్య కాలనీలో వున్న బంధువుల ఇంట్లో హయిగా రెస్టు తీసుకుంటున్న విజయరాణిని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయరాణిని పోలీసులు విజయారాణి చేత అసలు గుట్టంతా బయట పట్టించడానికి వాళ్ళదైన శైలిలో ‘విచారణ’ చేస్తున్నారు. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో జనాన్ని ఎలా మోసం చేసిందీ, ఎలా బుట్టలో వేసిందీ చిట్టీల చిట్టెమ్మ వివరంగా చెబుతుంటే, ఆమె తెలివితేటలు చూసి పోలీసులే నోళ్ళు తెరుస్తున్నారట.