సరైన సమయంలో సరైన  సూచన.. అయినా జగన్  వింటారా? 

‘ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో  పదిహేను, పదహారు మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవమున్న ఆర్థిక మంత్రి...కొణిజేటి రోశయ్య. నలుగురైదుగురు ముఖ్యమంత్రుల ఆర్థిక మంత్రిగా ఆయన చరిత్రను సృష్టించారు.  ఆర్థిక క్రమ శిక్షణకు మారు పేరుగా నిలిచారు. అంత సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసినా ఆయన ఎప్పుడూ ఆర్థిక క్రమశిక్షణ గీత ‘పెద్ద’గా  దాటలేదు. చివరకు చేతికి ఎముక లేదని అనిపించుకున్న వైఎస్సార్ ప్రభుత్వంలోనూ ఆయన, సంక్షేమం,అభివృద్ధి మధ్య సమతుల్యత తప్పకుండా, ఆర్థిక నావను బాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగారు. అప్పట్లో ఆయన తరచూ, ‘ఎట్లో వేసినా ఎంచి వేయాలి’ అనే సామెతను గుర్తు చేయడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.నిజం. సంక్షేమ పథకాలు ఎంత అవసరమో, సుస్థిర అభివృద్దికూడా అంతే అవసరం. 

ఇది యాదృచ్చికమే అయినా, పెద్దాయన రోశయ్య కన్నుమూసిన రోజునే, ఉప రాష్ర్జపతి వెంకయ్య నాయుడు, ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. పార్లమెంట్  పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పీఏసీ) శత వార్షికోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఓటర్లను ఆకర్షించేందుకు ముందు వెనకా చూసుకోకుండా కురిపిస్తున్న ‘ఉచిత’ వరాలు పై  జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరగవలసిన అవసరం ఉందని అన్నారు. ఇది కూడా చాలా నిజం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విషయాన్నే తీసుకుంటే,  ఉచిత వరాల వలన, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన వంటి అనేక ఆశించిన ఫలితాలు దక్కకే పోయినా  అనర్ధాలు మాత్రం జరుగు తున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం అందిన కాడికి అప్పులు చేస్తోంది.  ఆ అప్పులు తీర్చడం కోసం, అంచెలవారీ మధ్య నిషేధం వంటి ప్రకటిత లక్ష్యాలు పక్కకు పోయాయి. భవిష్యత్’లో మద్యం విక్రయాల ద్వారా వస్తుందని ఆశిస్తున్న అఆదయం కుదువ పెట్టి, ప్రభుత్వం ప్పులు తెచ్చింది. మరో వంక రేపటి అప్పులు తీర్చడం కోసం కావచ్చు.హై స్కూల్ విధ్యార్ధులు, స్కూల్ ఆవరణలోనే మద్యం సేవింఛి స్థితికి చేరుకుంటున్నారు 

నిజం, జగన్మోహన రెడ్డి రెండున్నరేళ్ళ పాలనలో ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్’గా మారిన నేపధ్యంలో, ఏపీని ఓకే కేసు స్టడీగా తీసుకుని పరిమిత వనరులను సంర్ధవంతంగా వినియోగించుకోవలసిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే విధంగా, జాతీయ స్థాయిలో చర్చ అవసరం. అందులో మరో అభిప్రాయానికి తావు లేదు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించారు. నిజంగా అవసరమైన వారికి, ఆపదలో ఉన్న వారికి అవసరమైన సహాయం, చేయూత ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, అన్నారు. ..ఇందులోనూ మరో అభిప్రాయానికి తావు లేదు. అయితే, ప్రస్తుతం ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్’ లో జరుగుతున్నది, అందుకు పూర్తి విరుద్ధం. ఆర్ధిక క్రమశిక్షణ అడుగంటి పోయింది. ఓట్ల కోసం ఉచిత వరాలను పందారం మాత్రమే జరుగుతోంది. ఫలితంగా ఏమి జరుగుతోందో చూస్తున్నాం. ఆస్తులు – అప్పుల మధ్య అసమతుల్యత అదుపుతప్పి పోయింది.రాష్రం్ల అప్పులు పెరిగి పోతున్నాయి. చివరకు అప్పులు కూడా  పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. గడిచిన 8 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు బడ్జెట్‌లో చూపించిన దానికి కంటే 34 శాతం అదనంగా ఉండటంతో ఆర్థిక నిపుణుల సైతం ఆందోళన చెందుతున్నారు. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దిగజారుతూ సంక్షోభంలోకి వెళుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితికి ఇంతకంటే ఉదాహరణలు అక్కర్లేదని నిపుణులు అంటున్నారు. 

నిజానికి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలను మాత్రమే దృష్టికో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేయలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాలను రాజకీయ పార్టీల ఆలోచనా ధోరణికి దృష్టిలో ఉంచుకునే, ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చును. కానీ,, వెంకయ్య నాయుడు చేసిన సూచనలు ఏపీకి  బాగా అతికినట్లు సరిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడచిన రెండున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలై పోయింది. నిన్న, మొన్న వరకు ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సాధారణ ఖర్చులకు కూడా అప్పుల కోసం వెతుక్కునే పరిస్థితికి దిగజారిన పరిస్థితి చూస్తున్నాం..అధికార పార్టీ సభ్యులే పార్లమెంట్’లో  ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించే పరిష్తితి లేదని వాపోతున్నారు. ఆదుకోండని   కేంద్రాన్ని వేడుకుంటున్నారు .ఈ నేపధ్యంలో ఉప రాష్ట్రపతి చేసిన సూచన ...సరైన సమయంలో ఇచ్చిన సరైన సూచన..కానీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం వింటుందా ... అంటే .. అదే జరిగితే పరిస్థితి అంతవరకు వచ్చేదే కాదుగా నేది నిపుణులు ఇస్తున్న సమాధానం.