దేశంలో 21కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. డేంజర్ జోన్ లో మహారాష్ట్ర, రాజస్థాన్ 

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ విజృంభిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. రాజస్థాన్ లో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్కరోజే రాజస్థాన్ రాజధాని జైపూర్ లో తొమ్మిది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సోకిన బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారంతా వారం క్రితం సౌతాఫ్రికా నుంచి వచ్చినట్లు గుర్తించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 8 ఒమిక్రాన్ కేసులు  నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఆదివారం గుజరాత్, ఢిల్లీలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పాజిటివ్ రాగా... వాళ్ల శాంపిల్స్ ను జీనోమ్ ల్యాబ్ కు పంపించారు, ా రిపోర్టులు వస్తే ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింతగా పెగరవచ్చని భావిస్తున్నారు. 

తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో కరోనా కలకలం రేగింది. చెలిమేడ మెడికల్ కాలేజీలో 35 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన విద్యార్థులకు సిబ్బంది టెస్టులు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు