ఈ ఆహారాలు పొరపాటున కూడా పచ్చిగా తినకూడదట.. ఇంతకీ ఇవేంటంటే..

ఆహారమే ఆరోగ్యం అన్నారు పెద్దలు. కానీ ఆహారం విషం కూడా అవుతుంది కొన్నిసార్లు.  దీన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటూ ఉంటాం. తిన్న ఆహారం శరీరానికి మంచి చేయకపోగా చెడు చేసే అవకాశం ఎక్కువగా ఉంటే మాత్రం అది చాలా ప్రమాదం.  అలాంటి ఆహారాలను పచ్చిగా తీసుకోకపోవడం మంచిది. విచిత్రం ఏమిటంటే రోజువారీ తీసుకునే ఆహారంలో చాలా మంచిది అనే కారణంతో చాలామంది తీసుకునే ఆహారాలే చెడు చేస్తాయని తేలింది. అలాంటి ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు.

పాలు..

పాలు చాలా గొప్ప పోషక పదార్థం. చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ పాలు తీసుకోవాలని, తద్వారా శరీరానికి తగిన కాల్షియం అందుతుందని చెబుతారు.  అయితే పాలను కాచకుండా పచ్చివి తాగడం చాలా ప్రమాదం.  పాలలో ప్రమాకరమైన జెర్మ్స్ ఉండే అవకాశం ఉంది. ఇది చాలా అనారోగ్యానికి గురిచేస్తుంది.  అందుకే పాలను ఎల్లప్పుడూ బాగా మరిగించిన తరువాతే తాగాలి.

మొలకలు..

మొలకలు చాలా గొప్ప ఆహారం. ఇందులో ఉన్నన్ని పోషకాలు మాంసాహారంలో కూడా లభించని అంటారు. కానీ మొలకలను సరైన విధంగా మొలకెత్తించడం, జాగ్రత్త చేయడం చేయకపోతే అవి మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాయి. మొలకల్లో ఇ-కోలి, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజన్, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

గుడ్లు..
 
పచ్చి గుడ్లను అప్పటికప్పుడు పగలకొట్టి గుటాగుటా తాగడం కొందరికి అలవాటు. అయితే గుడ్లను తినడానికి ముందు ఉడికించాలి.  పచ్చిగుడ్లలో కూడా ప్రమాదకరమైన బ్యాక్టిరీయా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

అన్నం..

అన్నాన్ని మళ్లీ ఉడికించడం ఏంటనే డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ ఇక్కడ విషయం అది కాదు. సరిగ్గా ఉడికీ ఉడకని అన్నాన్ని తీసుకుంటే అది ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతుంది.  సరిగ్గా ఉడకని అన్నంలో బాసిల్లన్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ది చెందుతుంది. ఇది శరీరంలో చాలా వేగంగా టాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది.

గుల్లలు..

సముద్రపు ఆహారాలైన గుల్లలు చాలా మంది తింటారు.  అయితే వీటిని పచ్చిగా తినడం వల్ల హానికరమైన వైరస్ల బారిన పడే అవకాశం ఉంది.  అందుకే వీటిని పూర్తీగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి.

చేపలు..

చేపలు, పీతలు వంటి సముద్రపు ఆహారాలు కూడా పచ్చిగా తినడం ఎంతమాత్రం మంచిది కాదు. వీటిని సరిగ్గా ఉడికించకుండా తింటే ప్రమాదకమైన ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. కాబట్టి వీటిని బాగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి.

మాంసం..

ప్రస్తుతం చాలామంది మాంసాహారులుగా రూపాంతరం చెందారు. సరిగా ఉడకని మాంసం తినడం వల్ల సాల్మోనెల్లా, ఇ కోలి, క్యాంపిలోబాక్టర్ వంటి సూక్ష్మక్రిములు  శరీరంలో చేరతాయి. ఇవి తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతాయి.

                                                               *నిశ్శబ్ద