వీరప్పన్ వారసుడు జగన్!
posted on Jul 11, 2024 10:57AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఎస్ జగన్‌కి మంచి బిరుదు ఇచ్చారు. జగన్ వీరప్పన్ వారసుడు అని తేల్చేశారు. గురువారం నాడు బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయం నుంచి బయటకి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైవసీపీ పాలకులు వీరప్పన్ వారసులు అన్నారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను వీళ్ళందరూ కలసి దోచుకున్నారని, ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘‘శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చింది. జగన్ అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు’’ అన్నారు.