వంశీని సర్కార్ వేధిస్తోందంట.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన పంకజాక్షి

అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు  పెట్టి  వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్  పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది. ఇంతకీ  ఆ గొంతు ఎవరిదంటే వల్లభనేని వంశీ సీమణి  పంకజాక్షిది. ఔను  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన భర్తపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందంటున్నారు వల్లభనేని  పంకజాక్షి.  ఈ మేరకు ఆమ రాష్ట్ర వర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 25) విజయవాడలోని రాజ్ భవన్ కు  వెళ్లి ఫిర్యాదు చేశారు  తన భర్త వల్లభనేని వంశీ పట్ల కూటమి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌ కు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ సందర్భంగా ఆమె వెంట వైసీపీ నేతలు నేతలు  మాజీ మంత్రి పేర్ని నాని,  ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ కూడా ఉన్నారు. 

జగన్‌   హయాంలో చంద్రబాబు మీద, లోకేష్‌ మీద, టీడీపీ మీద, నారా భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, అదే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసు, భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో  రిమాండ్‌ ఖైదీగా  ఉన్నారు.