వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్లపై  విచారణను ఏపీ హైకోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం పోలీసుల పీటీ వారెంట్  పై వంశీ హౌస్ మోషన్ పిటిషన్   దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్   మంజూరు చేయాలని  ఆ పిటిషన్ లో కోరారు.

అయితే వంశీ బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  ఇక పోతే బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈ సాయంత్రం వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.  ఇలా ఉండగా.. అక్రమ మైనింగ్ కేసులో కింది కోర్టు అనుమతించినా గురువారం వరకూ పీటీ వారంట్ జారీ చేయబోమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏది ఏమైనా బెయిలు విషయంలో వల్లభనేని వంశికి మరోసారి చుక్కెదురైంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu