వైభవంగా గోవిందరాజస్వామి వారి వాహన సేవ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం (జూన్ 3) స్వామివారు దేవేరులతో కలసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 గంటలకు వాహనసేవ వైభవంగా ప్రారంభమైంది.

నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.  ఇక సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరు గంటల వరకూ స్వామి, అమ్మవార్ల ఊంజల సేవ జరగనుంది. అనంతరం  రాత్రి 7.00 గంటల నుండి 9.00గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu