"సిగ్గున్నదరా భయ్".. వర్మ కౌంటర్ కు వీహెచ్ రివర్స్ కౌంటర్...


 

అనుకన్నదే జరిగింది. రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇస్తే దానికి వీహెచ్ ఊరుకుంటాడా..? అని అనుకున్నారో లేదో.. వెంటనే రియాక్షన్ రానే వచ్చింది. అర్జున్ రెడ్డి పోస్టర్ చింపినందుకు గాను రాంగోపాల్ వర్మ వీహెచ్ పై ఒక రేంజ్ లో కామెంట్లు పోస్టు చేసిన సంగతి తెలిసిందే కదా.. హనుమంతరావు అర్జున్‌ రెడ్డి పోస్టర్‌ను ఎందుకు చించేశారో తనకు అర్థం కావడం లేదని...అంత అందమైన అమ్మాయి.. విజయ్‌ దేవరకొండకు ముద్దివ్వడం ఆయనకు రుచించకపోయి ఉండొచ్చని.. ఒకటా రెండా.. వర్మ నోటికి వచ్చినట్టు సెటైర్లు విసిరాడు. ఇక వర్మ సెటైర్లపై రియాక్ట్ అయిన వీహెచ్... వర్మపై తనదైన శైలిలో కామెంట్లు విసిరారు. "సిగ్గున్నదరా భయ్... నువ్వసలు దర్శకునివేనా?... సమాజానికి ఇట్లాంటివి చెబుతావా..తాతయ్య మనవడి దగ్గరకు వెళ్లి, బాబూ ముద్దెట్ల బెడతవురా? అని నేర్చుకోవాలా? తాతయ్యకు తెలియదరా భయ్.. సినిమాలు అమ్ముకోవడమే లక్ష్యమా? సమాజం, విలువలు, సంస్కారం వంటివి లేవా? పనిలేక ఇలాంటివన్నీ చెబుతున్నవా? మంచి సినిమాలు తీసి సమాజ ఉన్నతికి పాటుపడాలి కానీ, ఇలాంటివి సమర్థిస్తవా?" అని తీవ్రంగా మందలించారు. నీకు సినిమాలు తియ్యనికి చేతకాకపోతే గమ్మున కూర్చోవాలని ఆయన సూచించారు. పని లేక ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మరి తాత కౌంటర్ కి వర్మ మళ్లీ ఏదైన రివర్స్ కౌంటర్ ఇస్తాడా..? లేక గమ్మునుంటాడా..? వీళ్ల వార్ ఎంత వరకూ నడుస్తుందో చూద్దాం...