నెల గడిచిన మానని గాయాలు

 

Uttarakhand tragedy, Uttarakhand Floods, uttarakhand floods 2013

 

 

కైలాస నాథుని సాక్షిగా ఉత్తరాఖండ్‌ వరద బీభత్సం దేశానికి తీరని నష్టం మిగిల్చింది. చార్‌ధామ్‌ యాత్రకని వెళ్లిన వారిలో చాలా మందే మృత్యువాత పడగా ఇంకా ఎంతో మంది జాడ కూడా తెలియటం లేదు... నెల క్రితం వరకు కేధర్‌నాద్‌, బద్రీనాధ్‌, గంగ్రో తి, యమునోత్రి, లాంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకల లాడాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా స్మశాన నిశబ్దం ఆవహించింది..

 

సోమవారంతో ఈ వరద బీభత్సానికి నెల రోజులు పూర్తయ్యాయి. దీంతో వరదల్లో గల్లంతయిన వారిని గుర్తించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న టైం  ముగిసిందని ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌బహుగుణ చెప్పారు. ఇప్పటికి 5వేల 748 మంది యాత్రికుల జాడ తెలియట్లేదని చెప్పారు. అయితే వారందరు చనిపోయినట్టు నిర్ధారించటం లేదని ఇంకా వారికోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. ఐతే తాము అనుకున్న గడువు ముగిసినందున గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్  గ్రేషియా చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు.



కానీ భవిష్యత్తులో ఈ గల్లంతయిన వారిలో ఎవరైన తిరిగి వస్తే ఎక్స్‌క్రేషియా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని చెప్పారు.. చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం మూడున్నర లక్షలు చెల్లిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షల పరిహారం అందిస్తోంది. ఐతే బాధిత కుటుంబాలు తమవారు చనిపోయినట్లు అంగీకరిస్తూ సంతకం చేస్తేనే వారికి పరిహారం అందిస్తున్నట్లు బహుగుణ తెలిపారు.



మరోవైసు ఇంకా ఆళయ పరిసర ప్రాంతాల్లో శిథిలాలు అలాగే ఉన్నాయి.. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఆ శిధిలాలను తొలగించలేకపోతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చార్‌దామ్‌ యాత్ర తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం కనిపించటం లేదు..