తెలంగాణ పై జైపాల్ తో దిగ్విజయ్ చర్చ

 

Digvijay Singh,  Digvijay Singh Jaipal Reddy, Jaipal Reddy telangana

 

 

రాష్ట్ర విభజన సమస్య పై కేంద్రం భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తో సమావేశం కావడం ప్రాధాన్యం సత్కరించుకుంది. గతకొంతకాలంగా జైపాల్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ భేటి తరువాత జైపాల్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్ మంత్రి జానా రెడ్డితో పాటు మరికొందరితో ఫోన్ లో మంతనాలు జరిపారు.


ఈ సారి తెలంగాణ రావడం ఖాయమని జైపాల్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారని సమాచారం. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ బహరింగంగా చర్చలు జరపడం శుభసంకేతం అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంలో ఇప్పటి వరకూ తెర వెనుక ఉంటూ వచ్చిన జైపాల్ తో అధిష్టానం పెద్దలు చర్చలు జరపడం సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.