ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు... 89 రోజు నుండి తగలబడుతున్న అడవి
posted on May 2, 2016 3:06PM

ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇప్పటివరకూ ఆగనేలేదు. దాదాపు 89 రోజు నుండి తగలబడుతున్న అటవీ ప్రాంతంలో సుమారు 70 శాతం మేరకు మంటలు వ్యాపించాయి. దీంతో దట్టంగా వ్యాపించిన పొగలవల్ల సహాయక చర్యలు కూడా చేయడానికి చాలా ఇబ్బందిగా మారింది పరిస్థితి. మరోవైపు శాటిలైట్ చిత్రాల ఆధారంగా మంటలు ఆర్పడానికి ఒకపక్క అగ్నిమాపక యంత్రాలు నిరంతరం శ్రమిస్తుండగా.. మరోవైపు ఐఏఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, స్థానిక అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు రంగంలోకి దిగి భీమ్‌తల్ సరస్సు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పుతున్నాయి. కొద్ది రోజుల్లో పూర్తిగా మంటలను ఆర్పేస్తామని ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా అడవుల్లోని మంటల గురించి ఉత్తరాఖండ్ గవర్నర్, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. ఇంకా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించి ప్రస్తుతానికి 70 శాతం మేరకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.