ఉత్తరాఖండ్‌లో జలప్రళయం.. కొట్టుకుపోయిన ఇళ్లు
posted on Aug 5, 2025 3:49PM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆకస్మిక వరదలు సంభవించాయి.పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధరాలీ గ్రామాన్ని ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ విపత్తులో దాదాపు 60 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు.