చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
posted on Jun 29, 2025 12:50PM
.webp)
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24 గంటల పాటు చార్ ధామ్ యాత్రను నిలిపేశారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ప్రస్తుతం ఒడిశా లోని పూరీలో జగన్నాథ రథయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పూరీలోని జగన్నాథ రథయాత్రలో తాజాగా అపశృతి జరిగింది. అక్కడి గుడించా దేవాలయం వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు భక్తులు మృతి చెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరుకైన ప్రాంతంలో చెక్కదొంగల లోడుతో ఉన్న ట్రక్కులు రావడంతో తోపులాట జరిగిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు నెట్టుకొని.. కింద పడిపోయారని చెబుతున్నారు. అంతలోనే ముగ్గురు మరణించారని కూడా సమాచారం అందుతుంది.