కాంగ్రెస్ లోకి రంగీలా హీరోయిన్

 

ఎన్నికల వేళ సినీ ప్రముఖుల సందడి మొదలైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పలు పార్టీల్లో చేరి సందడి చేస్తుండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్‌ ప్రముఖ నటి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. రంగీలా ఫేం ఊర్మిళ మటోండ్కర్‌ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఊర్మిళ బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ ఎంపీ గోపాల్‌ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీని ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్‌.. ఊర్మిళ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఊర్మిళ కూడా పోటీచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.