యూపీ సీఎం యోగి బయోపిక్ కు సెన్సార్ చిక్కులు.. విడుదల సందిగ్ధం?

ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా విడుదల సందిగ్ధంలో పడింది. మాజీ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ జీవిత కథ  ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్ అన్న పుస్తకం ఆధారంగా రవీంద్రగౌతమ్ దర్శకత్వంలో రూపొందిన  ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ మాంక్ అన్న సినిమా  రూపొందింది. ఈ సినిమా నిర్మాత రీతు మొంగి. వాస్తవానికి ఆ సినీమా శుక్రవారం ( ఆగస్టు 1)న విడుదల కావాల్సి ఉంది.

అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో విడుదలకు అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఈ సినిమా నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించారు.  నిర్మాతల పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ముంబై హై కోర్టు  సెన్సార్ బోర్డును సర్టిఫికెట్ నిరాకరణకు కారణం చెప్పాలని ఆదేశించింది. యూసీ సీఎం జీవిత కథ ఆధారంగా వచ్చిన ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్ పుస్తకం గత ఎనిమిదేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ, ఆ పుస్తకం ఆధారంగా నిర్మించిన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీసింది.

 దీనిపై రెండు రోజుల్లోగా సమాధానమిస్తామని సెన్సీర్ బోర్డు కోర్టును గత వారమే కోరింది. దీంతో యోగి బయోపిక్ పై ముంబై కోర్టు శుక్రవారం (ఆగస్టు 1)న విచారించనుంది.  దీంతో యోగి బయోపిక్ శుక్రవారం (ఆగస్టు1) విడుదల విషయంలో అయోమయం నెలకొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu