అతను బతికేఉన్నాడు.. రోడ్డు వేసేశారు
posted on Sep 21, 2015 5:13PM

కార్మికుల నిర్లక్ష్యంతో బతికున్న మనిషిపై రోడ్డు వేసి అతని ప్రాణాలను బలిగొన్నారు. ఈదారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లోని కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో జరిగింది. వివరాల ప్రకారం లటోరి బర్మాన్ అనే వక్తి తన భార్యతో పండుగ సందర్భంగా తన అత్తగారింటికి వెళ్లాడు. అయితే పండుగ అయిపోయిన తరువాత తన భార్యను అక్కడే వదిలి పెట్టి తన ఊరికి బయలుదేరాడు. అయితే బర్మాన్ కు మద్యం అలవాటు ఉండటంతో మధ్యలో ఆగి తాగి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పటికే ఎక్కవ తాగడంతో నడుస్తూనే మధ్యలో పడిపోయాడు. అయితే... ఆయన పడిన చోట పెద్ద గొయ్యి ఉంది. ఆ మరుసటి రోజు రోడ్డు పనులు చేసే కూలీలు ఆ గుంతలో అతనిని చూడకుండానే కంకర,మట్టి వేసి పూడ్చిపెట్టారు. అయితే వారు కంకర వేస్తున్న సమయంలో మెలకువ వచ్చిన బర్మాన్ బయటకు రావడానికి ప్రయత్నించిన క్రమంలో ఒక చేయి మాత్రమే బయటకు వచ్చింది కాని ఫలితం లేదు. ఊపిరిఆడక బర్మాన్ గుంతలోనే మరణించాడు. తరువాత రోడ్డుపై బర్మాన్ చేయి చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం తెలిసింది. అయితే కూలీల నిర్లక్ష్యం వల్లే బర్మాన్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.