నందమూరి ఫ్యామిలీ జోలికొస్తే ఖబర్దార్.. టీటీడీపీ నేతల ఫైర్
posted on Nov 20, 2021 4:41PM
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. తెలంగాణ టీడీపీ ఆందోళనలకు పిలుపిచ్చింది. ఆదివారం నుంచి 119 నియోజకవర్గల్లో మౌన ప్రదర్శన చేపట్టనున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు చెప్పారు.
ఏపీ శాసనసభలో చంద్రబాబుపై వైసీసీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ టీడీపీ నేతలు.
ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. ప్రజా అవసరమైన చట్టాలు శాసనసభ లో చేస్తారు..కానీ వ్యక్తిగత దూషణలు సరైంది కాదన్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా సేవలు అందించింది చంద్రబాబు నాయుడుపై నీచండా మాట్లారాని ఆయన మండిపడ్డారు. ఇంటికి పరిమితమైన ఒక ఇల్లాలిపై అసభ్యంగా మాట్లాడటం దారుణమన్నారు నర్సింహులు.
జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు బక్కని నర్సింహులు. 16 నెలలు జైల్లో జగన్ జైల్లో ఉన్నారన్నారు. నాని , వంశీ, చంద్రశేఖర్, అంబటి రాంబాబు మాటలు అత్యంత నీచంగా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ కూతురుపై గౌరవ శాసనసభ లో మాట్లాడే బాషా కాదన్నారు. వైసీపీ నేతల ఇండల్లోనూ మహిళలు ఉన్నారని అన్నారు నర్సింహులు. మహాత్మాగాంధీ ,అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా టీడీపీ నడుస్తుందన్నారు.