దర్గాలోకి వస్తే ఇంక్ పడుద్ది.. తృప్తి దేశాయ్ కు హెచ్చరిక

 

మహారాష్టలోని శనిసింగనాపూర్ ఆలయంలోకి, నాసిక్ త్రయంబకేశ్వరాలయంలోకి ప్రవేశించడానికి పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించిన భూమాతా బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ మరో పోరాటానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ముంబైలోని హలీ అజీ దర్గాలోకి ప్రవేశిస్తామని ఆమె ప్రకటించారు. అయితే దీనిపై శివసేన ఇప్పటికే ఆమె దర్గాలోకి ప్రవేశిస్తే.. చెప్పులతో కొడతాం అంటూ తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆమె కనుక బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే మాత్రం ఆమెపై నల్లరంగు సిరా చల్లుతాం అంటూ మహారాష్ట్రం ఎంఐఎం పార్టీ నేత హజీ రఫత్ హెచ్చరించారు.

 

మరోవైపు తృప్తి మాత్రం దర్గాలోకి మహిళలను ప్రవేశింపజేయాలని.. వారికి కూడా ప్రార్ధనల్లో సమాన హక్కులు కల్పించాలని.. ఈ నేపథ్యంలోనే దర్గా జంక్షన వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.