బాంబు పేల్చింది మేమే

 

ఇరాక్ బగ్దాద్ లో ఉగ్రవాదులు ట్రక్ బాంబు పేల్చి మారణ హోమం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 60 మంది మరణించగా మరో 120 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఈ బాంబు దాడికి పాల్పడి ఉంటారాని అనుమానం వ్యక్తం చేసిన పోలీసుల అనుమానాలు నిజమయ్యాయి. ఈ బాంబు దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్ద (ఐఎస్ఐఎస్) ప్రకటించింది. ముందు ముందు ఇలాంటివి ఇంకా జరుగుతాయని కూడా హెచ్చరిస్తూ ఆన్ లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu