త్రిషతో రానాకి ఏంటంట?
posted on Oct 1, 2012 5:48PM



త్రిషకి రానాకి మధ్య ఏదో నిప్పు రాజుకుందని టాలీవుడ్ వర్గాలు తెగ చెవులు కొరుక్కుంటున్నాయి. ఇద్దరూ ఒక్క నిమిషంకూడా విడిచిపెట్టలేనంత దగ్గరగా అతుక్కుని కనిపిస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. మా మధ్య స్నేహం తప్ప మరేం లేదంటూనే రానా, త్రిషలు తెగ కరుచుకుపోతున్నారని తెలుగు సినీవర్గాల భోగట్టా. త్రిష పదేళ్లుగా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో హీరోయిన్ గా కొనసాగుతోంది. మరి రానాకేమో కేవలం ఐదు సినిమాల అనుభవం. తన అనుభవాన్నంతా రంగరించి ఆరడుగుల కుర్రాణ్ణి త్రిష తేలిగ్గానే బుట్టలోపడేసిందని తెగ చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా ఇద్దరూ కలిసి ఓ మ్యాగజైన్ కి హాట్ హాట్ ఫోజులుకూడా ఇచ్చారు. ఓ అవార్డ్ ఫంక్షన్ కి కూడా కలిసేవచ్చారు. త్వరలోనే ఒకటైపోతారేమో అని కొంతమంది అనుకుంటుంటే .. లేదు.. లేదు.. కొత్త సినిమా కృష్ణం వందే జగద్గురుమ్ ఫ్రీ పబ్లిసిటీకోసం ఆడుతున్న డ్రామానే ఇదంతా అని మరికొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. నిజమేంటో కాలమే నిర్ణయించాలి మరి..