అమరావతి యాత్రకు అడ్డంకులు.. తెలుగు రాష్ట్రాలకు కలిపేస్తారా.. జగన్ తో నాగార్జున భేటీ... టాప్ న్యూస

గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ అయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవం ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. 50 మందికి పైగా ఈ అవార్డును ప్రధానం చేస్తారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో చర్చించినట్లు చెబుతున్నారు. 
---
సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ రాశారు. ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై లోకేష్  లేఖ రాశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు మూతపడుతున్నాయని విమర్శించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలను, ఆస్తులను దక్కించుకునేందుకే  యత్నిస్తున్నారని తప్పుబట్టారు. తొలగించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
-----------
అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ లేఖ రాశారు. ఇటీవల రైతుల పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి నిరాకరించారు. పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని డీజీపీ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 రాజధానులపై నిర్ణయం తీసుకుందన్నారు. రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ తేల్చి చెప్పారు.
--------
గంజాయి సాగు, రవాణాపై మాట్లాడానని తనకు నోటీసులిచ్చారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఆధారాలు సేకరించాలంటూ నానా హంగామా సృష్టించారని చెప్పారు. గంజాయి సాగుతో లోకేష్‌కు సంబంధం ఉందని విజయసాయి అన్నారని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని పవన్ అన్నారని చెప్పారు
------
ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు.
-----
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. జగన్‌తో లంచ్ చేశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. సినీ పరిశ్రమకు సంబంధించి ఏదైన సమస్య ఉంటే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కలిసి మాట్లాడే సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతోంది. 
----
వరి పంట విషయంలో కోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధిపేట కలెక్టర్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని ఏబీఎన్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. వరి పంటపై కేసీఆర్ డొల్లతనం బయటపడిందన్నారు. ధాన్యం కొనబోమని.. టీఆర్ఎస్ రిలీజ్ చేసిన లేఖలో ఎక్కడా లేదన్నారు. ధాన్యం గురించి తాను మాట్లాడితే ఉప్పుడు బియ్యం గురించిన లేఖను రిలీజ్ చేశారని ఆయన ఆరోపించారు
------
కలెక్టర్లు బాగా బలిసి రైతుల మీద మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు డ్రామాలు బంద్ చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల పక్షాన కాంగ్రెస్  పోరాడుతుందని ఆయన ప్రకటించారు. నవంబర్1 తర్వాత చలో సిద్దిపేట చేపడతామన్నారు.
-------
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలకు వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని షర్మిల నిలదీసారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయన్నారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు.
---------
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. బాంబే హైకోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. మూడు రోజులుగా ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మొత్తానికి గురువారం ఆర్యన్ ఖాన్‌కు, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ నితిన్ సంబ్రే తీర్పునిచ్చారు. డ్రగ్స్ కేసులో అక్టోబర్ మూడో తారీఖున ఎన్సీబీ అధికారులు ఆర్యన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 
---