అమ్మో గుండెలుతీసిన బంట్లు...  ర‌ఘురామ‌

అధికారంలో ఉన్నంత‌మాత్రాన అద్భుతంగా పాల‌న సాగిస్తార‌ని లేదు. కొన్ని పొర‌పాట్లు, కొన్ని తెలిసీ త‌ప్పుత‌డ‌క‌లూ చేస్తుంటారు. అలాగ‌ని అన్నింటినీ క‌ళ్లుమూసుకుని అంగీక‌రించ‌డం, అద్భుతం అని భ‌జ‌న‌చేయ‌డం కొంద‌రివ‌ల్ల కాదు. అధికారులు, మంత్రులూ తాన అంటే తందానా అనాల‌నీ లేదు. ఎవ‌రో ఒక‌రు త‌మలో త‌ప్పిదాల్ని నాయ‌కునికి తెలిసేలా చేయాలి. అదే నిజ‌మైన పాల‌నా ద‌క్ష‌త‌కు నిద ర్శ‌నం. అదే ప‌ని వైసీపీ ఎం.పి రఘురామ‌రాజు చేశారు.

వైసీపీ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం అమ్మ‌కాల విషయం లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను వైసీపీ  ఎంపీ  బ‌య‌ట‌పెట్టారు. త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలో వున్నం త మాత్రాన అన్నీ దాచాల‌ని లేదుగ‌దా. పైగా  రాష్ట్రంలో 30 వేల టర్నోవర్ కలిగిన మద్యం అమ్మకాలను నగదు చెల్లింపుల ద్వారా విక్రయిస్తూ తమది మచ్చలేని పరిపాలన అని ఎలా చెప్పుకుంటామ‌న్నారు. అయినా త‌మ‌ది అవినీతి ర‌హిత పాల‌న అని చెప్ప‌డానికి ఎంతో ధ‌ర్యం కావాల‌ని, గుండెలు తీసిన బంటులు కావాల‌ని వైసీపీ ఎంపీ. ఎద్దేవా చేశారు. 

అస‌లు త‌మ ప్ర‌భుత్వం విక్ర‌యిస్తున్న మ‌ద్యం ప్రాణాంత‌క‌మైన‌ద‌ని కేంద్రానికి ర‌ఘురామ రాజే ఫిర్యాదు చేయ‌డంతో పాటు ఏకంగా శాంపిల్స్ కూడా అంద‌జేశారు.  రాష్ట్రంలో మద్యం సేవించి 5000 మంది మృతి చెందినట్లుగా పవన్ కళ్యాణ్  పేర్కొన్నారని, అయితే ఆ సంఖ్య లక్షల్లో ఉండే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో రంగు, రుచి ,వాసన కోసం ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో డిస్టలరీను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎవరు అని ఎన్ని మార్లు ప్రశ్నించిన, ప్రభుత్వ పెద్దల నుండి సమాధానం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆడాన్ డిస్టలరీ నీ అల్లుడుదని అందరూ అంటున్నారని, నీదని ఎవరు అనడం లేదని విజయసాయి రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  ఆడాన్ డిస్టలరీ కంపెనీ డిస్టలరీలను లీజు తీసుకున్నదో చెప్పాలన్నారు. ఊరు పేరు లేని బ్రాండ్లను తయారు చేస్తూ, రాష్ట్రంలో మద్యాన్ని నగదు రూపంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నది నిజం కాదా?  అని పవన్ కళ్యాణ్  ప్రశ్నిస్తే తప్ప అని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు. 

రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ  టిడిపి నేత‌ చంద్రబాబు నాయుడు, జ‌న‌సేన నేత  పవన్ కళ్యాణ్ అన్నమాటలను తప్పేమున్నదని, అలాగే మీడియా రాష్ట్ర ప‌రిస్థితుల మీద  కథనాలలో అబద్ధం ఏమున్నది  ఫ‌లానా విషయంలో తప్పు అని  చెబితే అంగీకరించడానికి సిద్ధమన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu