టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య
posted on Feb 3, 2025 2:45PM

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో ఒక సారి డ్రగ్స్ కేసులో అరెస్టయిన సుంకర కృష్ణ ప్రసాద్ ఇటీవలి కాలంలో తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
గోవాలో ఓ హోటల్ గదిలో విగత జీవిగా ఉన్న ఆయనను చూసిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రీబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి.