తెలుగుదేశం ఖాతాలోనే తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి
posted on Feb 4, 2025 11:51AM
.webp)
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తెలుగుదేశం జయభేరి మోగించింది. తెలుగుదేశం కార్పొరేటర్, టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు పలుకుతూ ఓటు వేయగా, వైసీపీ అభ్యర్థికి కేవలం 21 ఓట్లు వచ్చాయి. చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నిక జరిగింది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో మూడు ఖాళీగా ఉన్నాయి. దీంతో డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావాలంటే 26 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు ఓటు వేయగా, వైసీపీ అభ్యర్థి భాస్కరరెడ్డికి 21 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.