తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు లైన్ క్లియరైనట్లేనా?

తెలంగాణలోస్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయయి పరిశీలకులు అంటున్నారు.   రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీ కాలం ఆదివారం (జనవరి 26)తో ముగిసింది. దీంతో అదే రోజు రాత్రి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్  ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.  

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండలపరిషత్, జిల్లాపరిషత్ లు ప్రత్యేక అధికారుల పాలనలోనే నడుస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలకు సమాయత్తం అయ్యింది. గ్రామ పంచాయతీల టర్ల తుది ఓజాబితాను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. దీంతో ఏ క్షణంలోనైనా గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా  ఆదివారం (జనవరి 26) నాలుగు సంక్షేమ పథకాల అమలును ఆరంభించింది.  రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ  ఇందిరమ్మ ఇళ్లు, పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. 

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తున్నందున కొత్త పథకాల అమలు కుదరదు కనుకే రాష్ట్ర ప్రభుత్వం ఒకింత వేగంగా సంక్షేమ పథకాల అమలుకు రెడీ అయిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.  ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణకు కసరత్తు ఆరంభించింది. ఇప్పుడు నాలుగు పథకాల అమలుతో ప్రజలకు చేరువయ్యామని భావిస్తున్న రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే అలా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu