వైసీపీకి షాక్...బీజేపీలోకి తొలి వికెట్ ?

 

ఉత్తరాదిన తమ దండయాత్ర విజయవంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాది మీద ద్రుష్టి పెట్టింది. కర్ణాటక మినహా మిగతా ఏ దక్షిణాది రాష్ట్రంలోనూ అంతగా పట్టు లేని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండే తెలుగు రాష్ట్రాల మీద గట్టిగా ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికి ఇప్పుడు నాయకులని తాయారు చేసుకోవడమ కష్టం కాబట్టి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఫలితంగా ఈ రెండు రాష్ట్రాల్లోని కొంతమంది కీలక నాయకులు బీజేపీలోకి వెళ్తున్నారు. 

ఈ మధ్య టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ బీజేపీ సహా పలువురు మాజీలు కూడా ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీ అధికార పార్టీకి చెందిన ఓ నేత బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమవుతున్నారని నిన్నటి నుండి ప్రచారం మొదలయ్యింది. టీడీపీ నుండి పెద్దాపురం టికెట్ ఆశించినా అక్కడ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 

అయితే మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ కొద్దిరోజుల క్రితమే వాణి కోర్టును కూడా ఆశ్రయించారు.దానిపై ఇంకా కోర్టులో ఉండగానే ఆమె బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మీద ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిన అధిష్టానం పెద్దాపురం వైసీపీ ఇన్‌చార్జిగా దొరబాబుకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.