మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ జరిగింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా ఊరు వెళ్లారు.

 తిరిగి వచ్చిన అనంతరం తమ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించామనీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  తమ నివాసం నుంచి లక్షన్నర నగదు, పెద్ద మొత్తంలో ఆభరణాలూ చోరీకి గురయ్యాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu