అత్తకోడళ్ల గొడవ.. తల్లిని చంపిన కొడుకు.. 

అతని పేరు మంకిలి శివ. ప్రేమ వివాహం చేసుకున్నాడు. జేసీబీ నడుపుతూ జీవనం సాగించేవారు. ఏ కుటుంబంలోనైనా అత్త కోడల మధ్య గొడవ సహజం. కానీ శివ కుటుంబంలో అత్త కోడల్ల గొడవతో విసిగిపోయిన కొడుకు కన్న తల్లినే దారుణంగా చంపేశాడు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికేపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

పోలికేపాడు గ్రామంలో మంకిలి శివ తల్లి మంకిలి కషమ్మ ,భార్య తో నివాసముంటున్నది.  అయితే ఇటీవల శివ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. చీటికి మాటికి అత్తకొడళ్లు గొడవలు పెట్టుకునేవారు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 6 నుండి 7 గంటల మధ్య శివ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అతను రావడంతోనే అత్త కోడళ్ళ మధ్య గొడవ మాట మాట పెరగడం మొదలైంది. అప్పటికే శివ మద్యం సేవించి ఉన్నాడు. దీంతో తల్లి మాటలకు ఆవేశం తట్టుకోలేని శివ గొడ్డలి తో మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన డీఎస్పీ కిరణ్ కుమార్,సీఐ సూర్యనాయక్. నిందితుడిని అదుపులోకి తీసుకొని,మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించామని ఎస్సై వామన్ గౌడ్ తెలిపారు.