జ"గన్" "ముద్ర"తో కాపు ఛానల్-2

తెలుగు మీడియా..దేశంలోని ఏ ప్రాంతీయ భాషకి లేనన్ని ఛానెళ్లు, పేపర్లు, మ్యేగ్‌‌జైన్లు, వెబ్‌సైట్లు ఇలా అన్నింటిలోనూ తెలుగులోనే ఎక్కువ. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో న్యూస్ ఛానల్ రాబోతోంది. పార్టీలు కూడా కులం ప్రాతిపదికమీద నడుస్తున్న ప్రాంతం మనది. కమ్మవారికి టీడీపీ, రెడ్లీకి వైసీపీ, కాపులకు జనసేన ఇలా కులం పార్టీని కమ్మేసింది. ఇదే సంస్కృతి మీడియాకి విస్తరించింది. అందుకే కులానికో ఛానల్ పుట్టుకోస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అగ్రకులాలకి సొంత మీడియా ఉంది. ఒక్క కాపులకు తప్ప.

 

మొన్నామధ్య కాపులకు నెంబర్ వన్ ఛానల్ వచ్చింది. మిగతా వారి వార్తలు ఇస్తున్నా ఫస్ట్ ప్రిఫరేన్స్ మాత్రం కాపులకే. అందుకే ముద్రగడ దీక్ష సమయంలో ఆ ఛానల్ కాస్త ఎక్కువగా హడావుడి చేసింది. దీంతో ఇప్పటి వరకు తమ వాణిని గట్టిగా వినిపించే ఛానల్‌ రాలేదని..ఇప్పుడు నెంబర్ వన్ తోడుగా ఉందని కాపులు నమ్మారు.  అయితే వార్తను వార్తలా కాకుండా వన్ వే ఇచ్చిందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గతం కంటే కాస్త రూటు మార్చుకుంది నెంబర్ వన్ న్యూస్. అందరి వార్తలను చాలా జాగ్రత్తగా కవర్ చేస్తూనే టీడీపీపై ఎదురుదాడి వ్యూహంతోనే వెళుతుంది.

 

కాపుల రిజర్వేషన్ అంశంతో మళ్లీ యాక్టివ్ అవుతున్న ముద్రగడ తన కులం వారిలో పాపులార్ కావడానికి, పలుకుబడి పెంచుకోవడానికి తనకు సొంతంగా ఛానల్ ఉంటే బాగుంటుందని ఆయన డిసైడ్ అయ్యారు. ఇప్పటికే "ప్రజాటీవీ" పేరుతో ఓ వెబ్‌పోర్టల్‌ను ఆయన అనుచరులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దానినే శాటిలైట్ ఛానల్‌గా తీసుకువచ్చే కసరత్తు చేస్తున్నారు పద్మనాభం. అయితే ఛానల్ పెట్టడమంటే మామూలు విషయం కాదు దానికి ఎక్విప్‌మెంట్, సిబ్బంది జీతభత్యాలు ఇలా తడిసిమోపెడవుతుంది. అందుకే కాస్త వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. అయితే మీకెందుకు నేనున్నానంటూ ముందుకొచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

 

2014లో తనను ఘోరంగా దెబ్బకొట్టిన కాపు ఓటు బ్యాంక్‌ను 2019 నాటికి తన దగ్గరికి చేర్చుకోవాలని ప్రతిపక్షనేత భావిస్తున్నారు. అందుకే కొత్త ఛానల్ ద్వారా కాపుల్లో ఐకమత్యాన్ని తెచ్చి ఆ క్రెడిట్ తన అకౌంట్‌లో వేసుకోవాలనుకుంటున్నారు. జగన్ పిలుపుతో తన ముఖ్య అనుచరులతో బెంగళూరులోని "ఒక ప్రైవేటు ఫార్మ్ హౌస్"కు వెళ్ళారు ముద్రగడ. ఆయన అనుచరులను సైతం బయటకు పంపి రహస్యంగా మంతనాలు జరిపినట్లు కాపునేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ చర్చల్లోనే ఛానల్ పేరు "ప్రజాటీవీగా" దానికి, "సామాన్యుడి ఆశల హరివిల్లు" అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టినట్లు టాక్. "ప్రజాటీవీ" ద్వారా "ముద్రగడ"ను కాపు "బ్రాండ్ అంబాసిడర్‌"గా మార్చి తెలుగుదేశానికి కాపులను దూరం చేసి, వైసీపీకి దగ్గర చేయాలని జగన్ వ్యూహం. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ముద్రగడ, జగన్‌లపై వ్యతిరేక వార్తలు రాస్తున్న ప్రముఖ మీడియా సంస్థను ప్రజాటీవీతో ఎదుర్కోవాలని వీరిద్దరి టార్గెట్. మ్యాటర్ ఏదైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా వీరి ఉమ్మడి శత్రువు తెలుగుదేశం పార్టీనే. సో వార్  ప్రజాటీవీకి, తెలుగుదేశానికి మధ్యే.