రవీంద్రభారతిలో టీఎస్ ఉగాది

 

తెలంగాణ రాష్ట్ర ఉగాది వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ పత్రికను అర్చకులు సీఎం కేసీఆర్‌కి అందించారు.