తెలంగాణలో భారీ టూరిజం ప్రాజెక్టులు


 


రాష్ట్ర విభజన జరిగి ఏడాది అయిపోయినా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగువేయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కలిగిన మూడు అత్యంత పెద్ద టూరిజం ప్రాజెక్టులను.. సుమారు రూ. 250 కోట్లుతో కూడిన ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అవి Heritage and spiritual tourism circuit,  Tribal Tourism  Circuit,  ECO Tourism Cricuit. ఈ మూడు టూరిజం ప్రాజెక్టులకు మహబూబ్ నగర్ జిల్లా మరియు, వరంగల్ జిల్లాలు అనువుగా ఉన్నట్టు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్(tstdc) గుర్తించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు రావడంలో ముఖ్యపాత్ర వహించింది బి.పి ఆచార్య అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉన్నఈయన తెలంగాణ టూరిజం ప్రచారం కోసం అనేక దేశాలు కూడా తిరిగారు. బంగారు తెలంగాణ సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ టూరిజం ప్రాజెక్టుల విషయంలో చాలా కృషిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది తెలంగాణ టూరిజం ప్రాజెక్టులకు 200 కోట్ల రూపాయలు వరకూ రాగా ఈ ఏడాది అది 300 కోట్ల రూపాయలు సాధించిందని తెలిపారు.


హెరిటేజ్ అండ్ స్పిరిట్యుయల్ టూరిజం సర్య్కూట్:
ఈ టూరిజం సర్క్యూట్ ని తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నిర్మించాలని యోచిస్తున్నారు. దీనిలో వరంగల్ జిల్లాలో చాలా ప్రముఖమైన దేవాలయాలు కొలనుపాక, జనగాన్, పాలకుర్తి దేవాలయం, బమ్మెర, ఘనపూర్, మెట్టుగుట్ట, ఏక వీర. ఇనవోలు, భద్రకాళి, పద్మాక్షి పాలంపేట్ దేవాలయాలను కలిపి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 61.63 కోట్లుగా అంచనా వేశారు.

ఇకో టూరిజం: ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రెండు విభాగాలుగా నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో మొదటిగా సోమశీల నది మరియు అక్క మహదేవి కేవ్స్ వరకూ ఒకటిగా.. అక్క మహదేవి గుహలనుండి ఫరహాబాద్, మల్లెలతీర్ధం, మన్ననూర్ ఉమా మహేశ్వరం దేవాలయం కలుపుకొని ఒక సర్యూట్ గా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 127.27 కోట్లుగా అంచనా వేశారు.

 

 


ట్రైబల్ టూరిజం ప్రాజెక్ట్: తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ములుగు, లక్నవరం, మేడారం, తడ్వాయ్, ఏటూరునగరాలను కలుపుకొని నిర్మించాలని చూస్తుంది. కాగా లక్నవరం ఇప్పటికే మంచి టూరిజం ప్లేస్. అక్కడ man made lake with hanging bridge ఉండటంతో మంచి టూరిజం స్పాట్ గా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో ఇంకా మంచి టూరిజం ప్రదేశంగా తీర్చిదిద్దాలని అధికారులు యోచిస్తున్నారు.  ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 96.61 కోట్లుగా అంచనా వేశారు.  


Online Jyotish
Tone Academy
KidsOne Telugu