యూపీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య..

 

ఉత్తరప్రదేశ్లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమిటి విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగులో ఆత్మహత్య లేఖ రాసి వసతి గృహంలో కృష్ణ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని.. కృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు అని పోలీసులు వెల్లడించారు.