వందల కార్లు అగ్నికి ఆహుతి..


ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని వందల కార్లు ఒకేసారి కాలి బూడిదైపోయాయి. ఈ ఘటన సిడ్నీలో జరిగింది. వివరాల ప్రకారం..సిడ్నీలో ఓ తుక్కు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక కార్లు కాలి బూడిదైపోయాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగే సమయానికి కంపెనీ మూసి ఉందని..  ఫ్యాక్టరీలో మొత్తం 26మంది పనిచేస్తుండగా 300 పాత కార్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మంటల్లో అనేక కార్లు కాలి బూడిదైనట్లు స్థానికులు వెల్లడించారు.