ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి కేంద్ర హోంశాఖ
posted on Aug 7, 2025 5:34PM
.webp)
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులోకి కేంద్రం ఎంటరైంది. ఈ వ్యవహారం జాతీయ అంశమని తొలి నుంచీ బీజేపీ చెబుతూనే ఉంది. ఇప్పుకు ఈ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఈ విషయమై ఆరా తీసేందుకు కేంద్ర హోంశాఖ అదికారులు హైదరాబాద్ చేరుకున్నారు.
వీరు గురువారం (ఆగస్టు 7) కేంద్ర మంత్ిర బండి సంజయ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, ఎస్ ఐబీ, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులూ కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని ఇప్పటికే బండి సంజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బండి సంజయ్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.