ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
posted on Aug 7, 2025 5:11PM

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగబోతుండగా.. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏక బదిలీ ఓటు పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు.
ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ జులై 21న ఆరోగ్య కారణాలతో ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఆయన పదవీకాలం వాస్తవానికి ఆగస్టు 2027 వరకు ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తికి పూర్తి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటులోని ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎంపీలందరూ (ఎన్నికైనవారు, నామినేటైనవారు) పాల్గొంటారు.