తెలంగాణ ప్రజలు భారతీయులు కాదన్న టీఆర్ఎస్ మాజీ నాయకుడు.. (వీడియో)

టీఆర్ఎస్ నాయకుల వేర్పాటువాద ధోరణి ముదిరిపోతోంది. ఇంతకాలం రాష్ట్రాన్ని విభజించే వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దేశాన్ని విభజించే వేర్పాటువాదాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా ఇండియాలో కలిపారని వ్యాఖ్యానించడం, కాశ్మీర్‌లో కొంతభాగాన్ని ఇండియా వదులుకోవాలని వ్యాఖ్యానించడం ఇందుకు ఒక నిదర్శనం. తెలంగాణను బలవంతంగా ఇండియాలో కలిపారన్న వేర్పాటువాద ధోరణి టీఆర్ఎస్ పార్టీలో బాగా పెరిగిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్నే టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుల వేర్పాటువాద ధోరణి ఎంత పెరిగిపోయిందంటే, టీఆర్ఎస్ నాయకులు తామసలు భారతీయులమే కాదని అంటున్నారు. భారతదేశం తెలంగాణ మీద దురాక్రమణ చేసిందని అంటున్నారు. అందుకు సాక్ష్యం.. ఆధారం మీరే చూడండి.. టీఆర్ఎస్ మాజీ నాయకుడు, టీఆర్ఎస్ స్థాపకులలో ఒకరైన ప్రకాష్ తెలంగాణ ప్రజలు భారతీయులు కాదంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!