అజ్ఞాతవాసం వీడిన కేటీఆర్

 

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. మొన్నామధ్య మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత మంత్రివర్గమంతా గవర్నర్‌తో గ్రూప్ ఫొటో దిగింది. ఆ ఫొటోలో కూడా కనిపించలేదు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కేటీఆర్ జాడ కనిపించలేదు. అంతకుముందే విదేశలకు వెళ్ళొచ్చిన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నందున్న రాలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పినప్పటికీ కేటీఆర్ గైర్హాజరు మీద రకరకాల కామెంట్లు వినిపించాయి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారికి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం, తాను సూచించిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వల్ల కేటీఆర్ అలిగారని అందుకే ఎక్కడా కనిపించడం లేదన్న వార్తలు వచ్చాయి. బయట ఎక్కడా కనిపించని కేటీఆర్ చివరికి తన కార్యాలయానికి కూడా రావడం మానేశారు. ఒక దశలో కేటీఆర్ ఎక్కడున్నారన్న విషయం కూడా ఆయన కార్యాలయ సిబ్బందికి కూడా తెలియకుండా పోయింది. ఆ సిబ్బందిని కేటీఆర్ ఎక్కడున్నారని అడిగితే, మాకు కూడా తెలియదు.. ఒకవేళ మీకు తెలిస్తే మాకూ చెప్పండి ప్లీజ్ అనేవరకూ పరిస్థితి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రెండ్రోజుల నుంచి మళ్ళీ తన కార్యాలయానికి రావడం ప్రారంభించారు. ఇంతకాలం ఎక్కడకి వెళ్ళారు సార్ అని మీడియావాళ్ళు ప్రశ్నిస్తే దానికి కేటీఆర్ ఘాటుగా సమాధానం చెప్పారు. నేను ఆమధ్య ఐటీ సమావేశాల్లో, పారిశ్రామికవేత్తల సమావేశాల్లో గంటలు గంటలు మాట్లాడితే ఏవో నాలుగు లైన్లు రాసి వదిలేశారు. అదే నేను నాల్రోజులు కనిపించకపోయేసరికి పేరాలు పేరాలు రాసేశారు. దీనిమీద వున్న శ్రద్ధ దానిమీద చూపిస్తే బాగుంటుంది కదా అన్నారు. అంతే మీడియావాళ్ళు కిక్కురుమంటే ఒట్టు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu