సంవత్సరానికి కేటీఆర్ సంపాదన ఎంతో తెలుసా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సంపాదన ఎంతో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం కేటీఆర్ వేతనం ఎంతో తెలిసింది. మంత్రిగా గత ఆర్థిక సంవత్సరానికి గానూ కేటీఆర్‌ రూ.7.22 లక్షల వేతనాన్ని అందుకున్నారు. అందుకు తగినట్లుగా 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి 28వ తేది వరకు ఆదాయపు పన్నును కూడా చెల్లించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో..మంత్రిగా కేటీఆర్ అందుకునే వార్షిక వేతనం అదన్నమాట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu