లాక్ డౌన్ పొడిగింపు.. సడలింపు పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను మరో 10 రోజులపాటు పొడిగించింది. లాక్ డౌన్ సడలింపు సమయాన్ని మరింత పెంచుతూ స్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు సడలింపు ఉండగా.. గురువారం నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఇంటికి చేరుకునేందుకు మరో గంట వెసులుబాటు. సాయంత్రం 6 గంటల కల్లా అందరూ ఇంట్లో ఉండాలని సూచించింది.  గతంలో పొడిగించిన లాక్ డౌన్ రేపటితో ముగియనున్న క్రమంలో.. సమావేశమైన కేబినెట్ లాక్ డౌన్ పొడిగింపు, కరోనా కట్టడితో పాటు పలు అంశాలపై చర్చించింది. లాక్ డౌన్ సడలింపు పై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేయనుంది.
కాగా.....కరోనా పూర్తిగా  అదుపులోకిరాని..   సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu